ఏపీలో పీఆర్సీ వివాదం.. మంత్రులతో కమిటీ

ap-govt-logo

పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల నేతల అనుమానాలను నివృత్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రప్రసాద్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలతో కలిసి కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ మెంబర్‌ కన్వీనర్‌గా సీఎస్‌ సమీర్‌శర్మ వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ నేతలు ఇవాళ ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు.

ఇదివరకే మంత్రి బోత్స, పేర్నినాని ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాతే ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామని వారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.