వేరే ఏ ప్రభుత్వమైనా ఇన్ని పథకాలు అమలు చేసిందా.?

Ministers Errabelli Dayakar Rao

Ministers Errabelli Dayakar Rao and  Koppula Eshwar were present in Gram Sabha in jagityal district
సీఎం కేసీఆర్ రూపొందించిన పల్లె ప్రగతితో గ్రామ స్వరూపం మారుతోందని, హరితహారం ద్వారా పల్లెలన్ని పచ్చదనంతో నిండుకున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో గ్రామసభ లో పాల్గొన్నారు మంత్రి. ఈ సందర్భంగా.. 70 సంవత్సరాలలో శుద్ధమైన మంచినీరు ఇవ్వాలన్న ఆలోచన ఏ ముఖ్యమంత్రికి రాలేదని, సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో ఇంటింటికి నీరు అందిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల ప్రశంసలు పొందుతున్న రాష్రం తెలంగాణ అని, ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వేరే ఏ ప్రభుత్వమైన ఇన్ని పథకాలు అమలు చేసిందా అని అన్నారు. బిజెపి పాలిత కర్ణాటకలో 500 పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని.. ఆరు నెలలుగా ఆ పెన్షన్ కూడా లేదని అన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ఆపలేదని చెప్పారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. మహిళలు ఆర్ధికంగా ఎదగాలనే స్త్రీ నిధి రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు.