యశ్వంత్ సిన్హా సభ కోసం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు

హైద‌రాబాద్‌లోని జ‌ల‌విహార్‌లో జులై 2న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కోసం సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాద‌వ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉమ్మడి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా జులై 2న ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారని తెలిపారు. బేగంపేటలో యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్, మంత్రులు స్వాగతం పలుకుతారని చెప్పారు. 10 వేల బైక్‌ల‌తో భారీ ర్యాలీగా బేగంపేట, రాజ్‌భ‌వ‌న్‌రోడ్‌, నెక్లెస్ రోడ్ మీదుగా జలవిహార్ చేరుకోనున్న‌ట్లు మంత్రులు వెల్ల‌డించారు.