మేనత్త తో వివాహేతర సంబంధం. పారిపోదామని ఒత్తిడి తేవటంతో ఆమెనే చంపేసిన మైనర్.

Murder

మేనమామా భార్య తో మైనర్ బాలుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 17 ఏళ్ల ఆ బాలుడిని ఒత్తిడి చేసి అత్త అతనితో ఇల్లిగల్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తోంది. ఐతే వీరి మధ్య జరిగిన ఓ గొడవ కారణంగా ఆ బాలుడు తన అత్తనే చంపేశాడు. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. తన భర్తను వదిలేసి ఇద్దరం ఏటైనా పారిపోదామని అత్త ఒత్తిడి తేవటం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె ప్రతిపాదనకు బాలుడు నో చెప్పాడు. దీంతో కోపంతో అతనిపై కత్తెరతో దాడి చేసింది. తప్పించుకున్న బాలుడు అదే కత్తెరతో అత్తపై విచక్షణరహితంగా దాడి చేశాడు. ఆమెను కసితీరా పొడిచాడు. అదే 15 సార్లు కత్తెర పొడిచి…ఆ తర్వాత ఇంట్లో బెడ్ షీట్ కు నిప్పుపెట్టి పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతురాలి ఒంటిపై 15 కత్తెర పోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

భర్తతోనూ గొడవలు

వీరి మధ్య సంబంధం గురించి భర్తకు తెలియటంతో చాలా రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయంట. ఈ విషయాన్ని పోలీసులకు స్వయంగా మృతురాలి భర్తే చెప్పాడు. హత్య జరిగిన సమయంలో అతను ఆఫీస్ లో ఉన్నాడు. భార్య ప్ర‌వ‌ర్త‌న‌తో తాను విసిగిపోయానని పిల్లలను కూడా వాళ్ల తాతా ఇంటి దగ్గరే ఉంచానని చెప్పాడు. అటు బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మైనర్ కావటంతో అతన్ని జువైనల్ హోంకు తరలించారు.