‘నిరుపేదలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం’ - TNews Telugu

‘నిరుపేదలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం’MLA Anjaiah Yadav said that the aim of CM KCR is to develop the poor in all walks of life

నిరుపేదలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం రంగా రెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో అర్హులైన పేదలకు ఎమ్మెల్యే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. నందిగామ మండల పరిధిలోని 692 లబ్ధిదారులకు, కేశంపేట్ మండలం లో 245 మంది లబ్ధి దారులకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులను పేద ప్రజలకు అందజేయడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, శాధిముబారక్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ అర్హులైన వారికి అందిస్తున్నారన్నారు. పేదలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్.. అనేక పథకాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోందని అన్నారు. రాబోయే వారం రోజల పాటు అర్హులైన అందరికీ కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వరి, ఎమ్మార్వోలు , పలు వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, సర్పంచులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.