కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన ఎమ్మెల్యే గాదరి కిశోర్.. ముగ్గురు ఆడపిల్లల తల్లికి రూ.2 లక్షల తక్షణ సాయం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో చాకలిగూడెంకు చెందిన దర్శనం సతీష్ ఎనిమిది నెలల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిండు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు అక్షిత (5), లాస్య (4), బేబీ (8 నెలలు) ఉన్నారు.  ఆ కుటుంబ పరిస్థితి కొందరు ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ దృష్టికి  తీసుకొచ్చారు. వెంటనే మంత్రి కేటీఆర్.. స్థానిక శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ కు TAG చేస్తూ ట్వీట్ చేశారు.

కేటీఆర్ ట్విట్ కు వెంటనే స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ముగ్గురు చిన్నారుల పేర్ల మీద బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి.. ఒక్కొక్కరి మీద రూ.50 వేలు ఫిక్సీడ్ డిపాజిట్ చేశాడు. దాంతో పాటు తక్షణ సాయం కింద మరో రూ.50 వేలు  మొత్తంగా రూ.2 లక్షలను కుటుంబ సభ్యులు దర్శనం శిల్పకు అందజేశారు.

అలాగే దర్శనం శిల్పకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, పిల్లల చదువుల కోసం గురుకుల పాఠశాలలో చేర్పించి, ఉండడానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. పిల్లలకు నావంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ హామీ ఇచ్చారు.