యాదాద్రి ఆలయానికి 2 కిలోల బంగారం విరాళమిచ్చిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడం కోసం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి రెండు కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు. కుటుంబ సమేతంగా శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆయన ఆలయ గోపురం కోసం రెండు కిలోల బంగారాన్ని వితరణ చేశారు. ఆలయ అర్చకులు మర్రి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించారు.


ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఆలయ నిర్మాణంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నామని జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆలయ ఈవో గీత, ఆలయ అధికారులతో కలిసి ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.