‘ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి న్యాయం చేసే గొప్ప నేత కేసీఆర్’

MLA Nannapuneni Narender handed over the cash cheque to the families affected by the floods

MLA Nannapuneni Narender handed over the cash cheque to the families affected by the floods

ఇటీవల కురిసిన వర్షాలకు జమ్మికుంట పట్టణంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద ముంపులో నష్టపోయిన కుటుంబాలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈరోజు చెక్కులను అందజేశారు. శనివారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో 468 మంది కి సంబంధించిన 1,778,400/- రూపాయల విలువ చేసే చెక్కులను వారికి ఎమ్మెల్యే, జమ్మికుంట పట్టణ ఇంచార్జ్ నన్నపునేని నరేందర్, మున్సిపల్ చైర్మన్ తక్ళళ్ళపల్లి రాజేశ్వర్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి, స్థానిక కౌన్సిలర్ నరేష్ గౌడ్, ఇతర కౌన్సిలర్లు, ముఖ్యనాయకులు అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి న్యాయం చేసే గొప్ప నేత కేసీఆర్ అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వ పక్షాన సహాయం అందించారన్నారు. జమ్మికుంట పట్టణం పట్ల ఈటెల రాజేందర్ గారు ఒక ప్రణాళిక లేకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిపెట్టకుండా గాలికొదిలేయడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో ఒక పక్కా మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రజలకు ఇలాంటి ఇబ్బంది పునరావృతం కాకుండా చూస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని,ప్రజలకు సేవ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా నిలిచి, అఖండ విజయాన్నందించాలన్నారు.