రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద జరుగాల్సిన ఎమ్మెల్సీల ఎన్నికలు వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు సీఈసీ ప్రకటించింది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో గడువు ముగియనుంది.

కాగా.. జూన్ 3న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఒకవైపు కరోనా వ్యాప్తి, మరోవైపు దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తిరిగి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ఆలోచించి.. రాష్ట్రాలను సంప్రదించిన తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని సీఈసీ ప్రకటించింది.