‘ఎమ్మెల్యే కోటా’ ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం షురూ

telangana mlcs

తెలంగాణ‌లో ‘ఎమ్మెల్యే కోటా’ ఎమ్మెల్సీల పదవీకాలం ప్రారంభమైంది. ఈ మేరకు ఇవాళ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

ఇటీవ‌ల కొత్త‌గా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ జారీ చేశారు. దీంతో ఇవాళ్టి నుంచి ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం ప్రారంభ‌మైనట్లయింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, క‌డియం శ్రీహ‌రి, బండా ప్ర‌కాశ్‌, వెంక‌ట్రామిరెడ్డి, త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికైన విష‌యం తెలిసిందే.