నాగలి పట్టి పొలం దున్ని.. రైతుల కష్టాలు తెలుసుకున్న నాయకుడు

సిద్దిపేట జిల్లా: ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్.. తన నియోజకవర్గమైన మానకొండూరు పరిధిలోని బెజ్జంకి మండలంలో ఇట్టిరెడ్డి పల్లిలో ఓ రైతులతో కలిసి నాగలి పట్టి పొలం దున్నారు. అనంతరం రైతులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బెజ్జెంకి మండలంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి రసమయి వెళుతున్న సమయంలో బెజ్జెంకి మండలం ఇట్టిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన రైతులు కొందరు దుక్కి దున్నుతున్నారు. వారిని చూసిన ఎమ్మెల్యే కారు ఆపించారు. తర్వాత రైతుల దగ్గరికి వెళ్లి వారితో పాటు తాను కూడా కాసేపు దుక్కి దున్ని రైతులతో కాసేపు ముచ్చటించారు.