సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ర‌స‌మ‌యి

MLA Rasamayi Balakishan assumes duties as Telangana Cultural Sarathi Chairman

MLA Rasamayi Balakishan assumes duties as Telangana Cultural Sarathi Chairman

తెలంగాణ సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ బాధ్య‌తలు స్వీక‌రించారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాల‌రీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ గోర‌టి వెంక‌న్నతో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్‌, గోర‌టి వెంక‌న్న శుభాకాంక్ష‌లు తెలిపారు.

వారం రోజుల క్రితం బాలకిషన్ ను సాంస్కృతిక సారథి చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల పాటు చైర్మన్ పదవీ కాలం కొనసాగుతుంది. తనను సాంస్కృతిక సారథి చైర్మన్ గా పునర్నియామకం చేయడం పట్ల కృతజ్జతలు తెలుపుతూ, నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి ఎమ్మెల్యే బాలకిషన్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తన నియామక పత్రాన్ని అందుకున్నారు.