ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే రోజా

mla roja discharged from chennai fortis hospital after ten days

మేజర్ ఆపరేషన్‌లతో కొద్దిరోజులుగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నగరి ఎమ్మెల్యే రోజా శనివారం డిశ్చార్జి అయ్యారు. మార్చి నెలలో చెన్నై అడయార్‌లో ఉన్న మలర్‌ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు రెండు సర్జరీలు చేయించుకుని పదిరోజుల పాటు అడ్మిషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం రోజా పరిస్థితి మెరుగుపడడంతో శనివారం వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు.