హైదరాబాద్: పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, జీవన్ రెడ్డిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుట్రలకు చోటు లేదన్న ఎమ్మెల్సీ కవిత, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, జీవన్ రెడ్డిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. pic.twitter.com/Y8sYtfhs62
— Jeevan Reddy MLA (@jeevanreddytrs) August 5, 2022