సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kavitha participated in sankranthi festival

సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జరుపుకున్నారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వాకిట్లో గొబ్బెమ్మలు, హరివిల్లును తలపించే రంగురంగుల ముగ్గులతో ప్రత్యేక శోభను సంతరించుకుంది.

ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి, సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ  సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.  ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.