కొత్తపేట అష్టలక్ష్మీ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

హైదరాబాద్ లోని కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవితతో పాటు పూజలో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.