సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మొదలైన కౌంటింగ్ - TNews Telugu

సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మొదలైన కౌంటింగ్MLC Votes Counting Starts in Saroor Nagar Stadium 
MLC Votes Counting Starts in Saroor Nagar Stadium

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమైంది. కాగా, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు నల్గొండలో ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

రెండు నియోజకవర్గాల్లో పోటీలో నిలిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతోపాటు పోలింగ్‌ కూడా భారీగా జరిగింది. ఫలితాలు వెలువడేందుకు ఒకటిన్నర నుంచి రెండు రోజుల వరకు పడుతుందని ఎన్నికల సంఘం అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌లో 93 మంది పోటీ చేయగా 3,57,354 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా 3,86,320 మంది ఓట్లు వేశారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా మధ్యలో ప్రారంభమయింది.