‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు.. ఉత్కంఠ పోరులో విజయం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై 400 పైచిలుకు ఓట్ల మెజారిటీతో  విజయం సాధించారు.  కౌంటింగ్ కేంద్రం దగ్గర మంచు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు జాయింట్‌ సెక్రటరీగా, వైస్‌ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు 7ఓట్ల తేడాతో జీవితా రాజశేఖర్‌పై, ట్రెజరర్‌గా శివ బాలాజీ (316 ఓట్లు) 32 ఓట్ల తేడాతో నాగినీడు(284)పై గెలుపొందారు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, నటీ హేమ వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించారు.

ఈసీ మెంబర్స్ విషయంలో మాత్రం ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ప్రకాశ్ రాజ్‌కు ప్యానల్‌కు చెందిన 11 మంది ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ గా గెల్వగా.. విష్ణు ప్యానల్‌కు చెందిన ఏడుగురు మాత్రమే ఈసీ సభ్యులుగా విజయం సాధించారు.