వాళ్లంతా నీచ నికృష్టులు..తెరపైకి మళ్ళీ పాత కక్షలు.. చిరంజీవిపై మోహన్ బాబు.. సంచలన విమర్శలు..!

mohan babu sensational comments on chiranjeevi
mohan babu sensational comments on chiranjeevi
mohan babu sensational comments on chiranjeevi
mohan babu sensational comments on chiranjeevi

ఇండస్ట్రీలో టామ్ అండ్ జెర్రిలా గొడవపడే సీనియర్ స్టార్స్ ఎవరంటే అందరు టక్కున చెప్పే పేర్లు చిరంజీవి మోహన్ బాబు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమ వజ్రోత్సవాల్లో బాహాబాహీకి దిగి.. ఒకర్నొకరు తిట్టుకున్న తీరు ఎప్పటికి మర్చిపోలేనిది. ఆ తరువాత దాసరి మధ్య వర్తిత్వంతో వీరిద్దరి మధ్య గ్యాప్ కొంచం కొంచం తగ్గుతూ వస్తు..మొన్న ఒక సభలో దోస్త్ మేరా దోస్త్ అన్న పంథాలో ఒకర్నొకరు ముద్దులు కూడా పెట్టుకున్నారు. ఇక మెగా మంచు హీరోల మధ్య గొడవలేమి ఉండవని భావించారు. కానీ అనుకోని తరహాలో మా ఎలెక్షన్స్ రూపంలో మరోసారి వీరిద్దరి మధ్య పాత కక్షలు పుట్టుకొచ్చేలా ఉన్నాయి. మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మంచు విష్ణు పోటీకి దిగుతుండటంతో తాజాగా వీరిద్దరి గొడవలకు కారణమయ్యేలా ఉంది. విష్ణుకి మద్దత్తివ్వకుండా.. మరో పోటీదారుడు ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తుండటంతో మోహన బాబు చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేశాడు. నా కొడుకు పోటీలో ఉన్నా.. మెగా ఫ్యామిలీ ఇతరులకి సపోర్ట్ ఇవ్వటం నాకు చాల బాధేసిందని.. నేను చిరంజీవి స్థానంలో ఉంటే అలా చేసుండే వాడిని కాదని.. ఇండస్ట్రీ నీచ నికృష్టంగా తయారైందని.. దాసరితోనే పెద్ద దిక్కు అనే పదం అంతరించిపోయిందని.. చాల రోజులకి మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కాడు.

తాజాగా ఒక మీడియా ఛానల్ తో మోహన్ బాబు ఓపెన్ టాక్ చేశాడు. ‘ మెగా ఫ్యామిలీ నుండి ఎవరైనా మా ఎన్నికల బరిలో ఉండుంటే,, నేను మంచు విష్ణుని పోటీలో నిలిపేవాడిని కాదు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కావొచ్చు, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ అవ్వొచ్చు, అల్లు అరవింద తనయుడు బన్నీ కావొచ్చు.. ఈ ముగ్గురిలో ఎవరు ఎన్నికల బరిలో ఉన్నా.. నేను నా కొడుకుని పోటీకి దింపేవాడిని కాదు. ఎందుకంటే వారు కూడా నా కొడుకులతో సమానం కాబట్టి. కానీ చిరంజీవి ఇలా చేయటం బాధాకరం. నా కొడుకుకి సపోర్ట్ ఇవ్వకపోగా.. ఇతర సభ్యుడికి చిరంజీవి మద్దత్తు తెలియజేశాడు. అయినా సరే నా కొడుకు గెలుపుని ఎవ్వరు ఆపలేరు. బాలకృష్ణ సపోర్ట్ మావాడికి ఉంటుంది. కృష్ణ గారిని కూడా కలిసాము. నేను 800వందల సభ్యులతో ఫోన్ లో మాట్లాడాను. విష్ణు 600మందిని కలిసాడు. అందరు మాకే మద్దత్తు అని చెప్పారు.

ప్రస్తుతం సినీ పరిశ్రమలో పెద్దలెవరూ లేరు. గురువుగారు దాసరి నారాయణరావుతోనే ఆ పెద్దరికం పోయింది. చిరంజీవి లాంటి వారు పెద్దలుగా భావించటం వారి వ్యక్తిగత వ్యవహారం. దానిపై నేను కామెంట్స్ చేయను. నన్ను ఇండస్ట్రీలో తొక్కేయ్యటం ఎవ్వరి తరం కాదు. రాజకీయాలకి నేను సూట్ అవ్వను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని కొందరు ఐపీఎస్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇకపై 99శాతం రాజకీయాలకి దూరంగా ఉంటాను. మోడీ గారంటే నాకు ఇష్టం. నన్ను ఆయన బడా భాయ్ అని పిలుస్తారు. అందుకే మిగిలిన 1పర్సెంట్ ఛాన్స్ చెప్పలేం’ అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించాడు. అయితే చిరంజీవిపై మోహన్ బాబు చేసిన తాజా విమర్శలకి మెగా ఫ్యామిలీ నుండి ఎవరు ఎలా కౌంటర్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం నాగబాబు మోహన్ బాబుకి కౌంటర్ ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. దీంతో మెగా మంచు కుటుంబాల మధ్య మరోసారి వార్ అట్మాస్పియర్ క్రియేట్ అయ్యేలా ఉందని అంటున్నారు.