బెనర్జీ నిన్ను చంపేస్తా .. మోహన్ బాబు ఉగ్రరూపం

Mohan Babu Serious Warning To Actor Banerjee In Maa Elections
Mohan Babu Serious Warning To Actor Banerjee In Maa Elections
Mohan Babu Serious Warning To Actor Banerjee In Maa Elections
Mohan Babu Serious Warning To Actor Banerjee In Maa Elections

మా ఎన్నికల క్లైమాక్స్ వచ్చేసింది. గడిచిన నెల రోజులుగా సినీ తారల మాటల యుద్ధం తారాస్థాయికి చేరటంతో ఒక్కసారిగా మా ఎన్నికలు ఎప్పుడు లేనంత హీటెక్కాయి. ఈ రోజు ఉదయం జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో మొదలైన మా ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ జరుగుతున్నాయి. మోహన్ బాబు స్వయంగా ఎన్నికల పర్వాన్ని దెగ్గరుండీ చూస్తున్నాడు. అక్కడ కోలాహలమంతా మంచు విష్ణుదే. ప్రకాష్ రాజ్ అండ్ ప్యానల్ సభ్యులు కొంచం తక్కువ హడావిడితోనే కనిపించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్ వంటి ప్రముఖులంతా తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకు పరిస్థితులు అదుపులోనే ఉండగా.. వారు వెళ్లిన తరువాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.

ఉన్నట్టుండి ‘మా’ ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. రెండు గ్రూపులకు చెందిన కొందరు సభ్యుల మధ్య తోపులాట జరిగింది. అసోషియేషన్ కార్డు లేని కొందరు సభ్యులు ఓటు వేయడానికి ప్రయత్నించారనేది ఆరోపణ. కాసేపు పోలింగ్‌ను ఆపేశారు. ఈ క్రమంలో మంచు విష్ణు ప్యానెల్ తరపున మంచు మోహన్ బాబు కోపంతో ఊగిపోయారు. బెనర్జీకి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కూడా ఎన్నికల అధికారికి ఫిర్యాదులు అందాయి. గుర్తుతెలియని వ్యక్తి మాస్క్ లో వచ్చి ఓటు వేస్తుండగా.. మంచు విష్ణు ప్యానల్ అతడిని అడ్డుకోడానికి చేసిన ప్రయత్నాల్లో పెద్ద గందరగోళమే జరిగింది. ఈ గొడవలోనే శివబాలాజి చేతిని నటి హేమ కొరికిపడేసింది. దాంతో మా ఓటింగ్ కాస్త మా బైటింగ్ అయిపోయింది. నన్ను అడ్డుకున్నందుకే నేను శివ బాలాజీ చేయి కొరికనంటూ నటి హేమ చెప్పటం జరిగింది.