మీ బెదిరింపులకు ఎవరు భయపడరు.. మోహన్ బాబు సీరియస్..!

Mohan Babu Strong Warning In Vishnu Oath ceremony
Mohan Babu Strong Warning In Vishnu Oath ceremony
Mohan Babu Strong Warning In Vishnu Oath ceremony
Mohan Babu Strong Warning In Vishnu Oath ceremony

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ‘మా’ కొత్త కార్యవర్గం కొంచెం సేపటి క్రితం కొలువు దీరింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణుతో              మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేశాడు. అందరిని కలుపుకుపోతాం అంటూనే స్ట్రాంగ్ వార్ణింగ్స్ ఇచ్చేసాడు. అనవసరంగా మమ్మల్ని ఎవరు బెదిరించొద్దు.. ఇక్కడ మీ బెదిరింపులకు ఎవరు భయపడరు. మేము సినిమాల్లో తోపులము మావి అన్ని హిట్ సినిమాలు అని విర్రవీగకండి.. దేవుడు చూస్తున్నాడు.. దెబ్బకొట్టేస్తాడు అంటూ చేసిన మోహన్ బాబు కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు.. మెగా హీరోలు, ప్రకాష్ రాజ్ ప్యానల్ నే మోహన్ బాబు టార్గెట్ చేస్తూ మాట్లాడాడా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మంచు విష్ణు ప్రమాణ స్వీకారం అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘ఇక్కడ నువ్వు గొప్పా.. నేను గొప్పా.. సినిమాలు ఉన్నాయా, లేవా అన్నది కాదు. ఎంత కష్టపడి సినిమా చేసిన ఒక్కోసారి ప్లాప్స్‌ వస్తుంటాయి. అంత మాత్రన కొందరు విర్రవీగుతున్నారు. అలా చేస్తే దేవుడు ఉంటాడు. దిమ్మతిరిగేటట్లు కొడతాడు. అంటూ సంచలన కామెంట్స్ చేశాడు మోహన్ బాబు. అయితే ఈ కామెంట్స్ ఎవ్వరిని ఉద్దేశించి చేశాడో అన్నది అందరికి తెలిసిందే. మెగా హీరోలని ఉద్దేశించే మోహన్ బాబు ఈ కామెంట్స్ చేశాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ఇక ‘మా’ ఎన్నికల సమయంలో మేము ఇంతమంది ఉన్నాం.. అంతమంది ఉన్నామని కొంతమంది వ్యక్తులు బెదిరించారు. కానీ ఆ బెదిరింపులకు ఎవరూ భయపడలేదు. మా ఓటు మా ఇష్టమని నా బిడ్డను గెలిపించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. నాకు పగ, రాగద్వేషాలు లేవు. నా తెలివి తేటలతో, క్రమ శిక్షణతో ఇక్కడి వరకు వచ్చాను అంటూ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సంచలన కామెంట్స్ చేశాడు మోహన్ బాబు.