మోహన్ బాబు సంచలనం.. ఆ మీడియా అధినేతని చంపేస్తానంటూ.. గన్ తో బెదిరింపులు..!

Mohan Babu Threatens Media Channel Chairmen With Gun
Mohan Babu Threatens Media Channel Chairmen With Gun
Mohan Babu Threatens Media Channel Chairmen With Gun
Mohan Babu Threatens Media Channel Chairmen With Gun

మోహన్ బాబు తెరపై ఎంత ఆవేశంతో ఉంటాడో.. తెరవెనుకాల కూడా అదే కోపంతో రగిలిపోతాడని.. తనముందు ఎవరు ఏ మాత్రం తప్పుచేసిన ఆరోజు మోహన్ బాబు చేతిలో వాళ్ళకి మూడినట్టే అని సోషల్ మీడియాలో వార్తలు ఎన్నో చూసాం. పెదరాయుడులో ఒక సీనియర్ లేడి ఆర్టిస్టుని కొట్టాడని కూడా రూమర్స్ వచ్చాయి. ఇక పద్ధతి, క్రమశిక్షణ అంటూ ఎందరో కళాకారులని తిట్టడం, కొట్టడం వంటివి చేస్తుంటాడని మీడియాలో వార్తలు చూస్తూనే ఉంటాం. అయితే మా ఎన్నికల్లో కూడా సీనియర్ నటుడు బెనర్జీని, హీరో తనీష్ ని పచ్చిబూతులు తిడుతూ కొట్టారని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన కూడా మీడియాలో అందరం చూశాం. అయితే తాజాగా మోహన్ బాబు చేసిన గొడవ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఒకరు సంచలన విషయాలని చెప్పాడు. మొన్నటి మా ఎన్నికల తీరుపై మాట్లాడుతూ మోహన్ బాబు కోపం గురించి కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ రివీల్ చేసిన ఈ జర్నలిస్ట్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో సీనియర్ జర్నలిస్ట్ జాకీర్ మాట్లాడుతూ.. ‘పోల్ మేనేజ్‌మెంట్ సరిగ్గా చేయటం రాకనే ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో ఓడిపోయాడు. మంచు లక్ష్మి, మంచు మనోజ్, మంచు విష్ణు, మోహన్ బాబు, నరేష్ వంటి వారు వర్గాలుగా విడిపోయి.. ఎక్కడెక్కడి నటులనో హైదరాబాద్ కి రప్పించి ఓట్లు వేసుకోవటంలో సక్సెస్ అయ్యారు. నేను గొప్ప నటుడ్ని నాకే ఓట్లు పడతాయని ప్రకాష్ రాజ్ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండటం.. మనం చెప్పిన అభ్యర్థికే ఓటు వేస్తారని మెగా హీరోలు పెద్దగా ప్రచారం చేయకపోవటంతోనే ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓటమి చెందింది. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే.. ఎన్నికల రోజున తిట్టారని కొట్టారని ప్రెస్ మీట్‌లో చాలామంది ఏడ్చారు. అయితే ఈ విషయాన్ని ఎన్నికలప్పుడే చెప్తే బావుండేది.బహుశా మోహన్ బాబుకి బయపడి చెప్పకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మోహన్ బాబు కొట్టడానికి రావటమే కాదు కొట్టిన కొడతాడు కూడా.

నాకు మోహన్ బాబు కోపం తెలుసు. నేను టీవీ9లో పనిచేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూశాను. ఒకసారి మోహన్ బాబు కుటుంబంలో ఇష్యు అయితే దాని గురించి టీవీ9లో వార్తా వచ్చింది. దాంతో మోహన్ బాబు చేతిలో గన్ పట్టుకుని టీవీ9 స్టూడియోకి వచ్చేశాడు. రవి ప్రకాష్ ఎక్కడ? కాల్చిపడేస్తాను అంటూ బెదిరించారు. నిజానికి ఆ వార్త తప్పు అయితే పోలీసులకి చెప్పొచ్చు.. కోర్టుకి వెళ్లొచ్చు. కానీ అలా ఏం చేయకుండా డైరెక్ట్ గా గన్ పట్టుకుని మోహన్ బాబు స్టూడియోకి వచ్చేశాడు. ఆ కోపం తీవ్రత ఎంత అనేది నేను టీవీ 9లో ఉన్నప్పుడు చూశాను. తన కోపం వల్ల తనే నష్టపోయాడంటూ మొన్న మంత్రి తలసాని కూడా చెప్పారు’ అంటూ కీలకమైన విషయాలను వెల్లడించారు జర్నలిస్ట్ జాకీర్.

Senior Journalist zakir
Senior Journalist zakir