కర్ణాటకలో మంకీ జ్వరం కలకలం.. తొలి కేసు ఆ జిల్లాలోనే

Monkey Fever in Shivamogga: Kyasanur’s ticking time bomb

దేశంలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఇటీవల ఒక మహిళ జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు ఆ మహిళకు చికిత్స అందించిన వైద్యులు, ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో పరీక్షలు జరిపారు. అందులో సదరు మహిళకు మంకీ ఫీవర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

రెండేళ్ల క్రితం రాష్ట్రంలో సాగర్‌ మండలంలోని అరళగోడు గ్రామంలో మంకీ జ్వరంతో 26 మంది మరణించారు. ఆ తర్వాత ఇలాంటి కేసులు వెలుగులోకి రాలేదు. మంకీ జ్వరం దక్షిణాసియాలోని కోతుల ద్వారా మనుషులకు సోకే వైరల్‌ జబ్బు. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణాలు సంభవిస్తాయి.