టీఆర్ఎస్ పార్టీదే నైతిక విజయం: గెల్లు శ్రీనివాస్‌

Gellu Srinivas yadav

Gellu Srinivas yadav

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ స్పందించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. టీఆర్ఎస్ కు ఓటేసిన ఓటర్లకు పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు. తన గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే నైతిక విజయమన్నారు. టీఆర్ఎస్ ఓటమి కోసం రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని గెల్లు మండిపడ్డారు. ఈటల గెలుపు కోసం కాగ్రెస్‌ అభ్యర్థిని బలి పశువును చేశారన్నారు.

ఎన్నికల్లో ఓడిపోతే కుంగిపోమని.. గెలిస్తే పొంగిపోమన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని గెల్లు అన్నారు. 2023లో హుజూరాబాద్‌ గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో గెలిచిన ఈటలకు శుభాకాంక్షలు తెలిపారు.