రాష్ట్రంలో 21 వేలు దాటిన యాక్టివ్ కేసులు

covid

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 68,525 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,398 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో ముగ్గురు మృతి చెందారు.

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1233 కేసులు నమోదు కాగా.. మేడ్చల్ లో 191, రంగారెడ్డి జిల్లాలో 192, హనుమకొండలో 60 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

రాష్ట్రంలో రికవరీ రేట్ 96.35 శాతంగా నమోదయింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 21,676 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.