కన్న కూతురితో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించిన తల్లి

ముంబైలో   ఘోరం జరిగింది. రూ. 50 వేలకు కన్న కూతురినే  వ్యభిచారం రొంపిలోకి దించేందుకు ఓ తల్లి ప్రయత్నించింది. తన మైనర్ కూతురిని వ్యభిచార గృహాలకు రూ. 50 వేలకు బేరం పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  పోలీసులు రంగంలోకి దిగి ఆ బాలికను కాపాడారు. ముంబైలోని మల్వానీ లో ఈ ఘటన జరిగింది.  ఆ తల్లిని, ఓ  బ్రోకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టమర్ల మాదిరిగా వ్యభిచార గృహ నిర్వాహకులను వాట్సాప్ నంబర్ల ద్వారా పోలీసులు సంప్రందించారు. మైనర్ బాలికను రూ. 50 వేలకు పంపుతామని బేరం కుదుర్చుకున్నారు. ఆ అమ్మాయిని మల్వానీ ప్రాంతానికి తీసుకురావాలని కోరగా..అలాగే తెచ్చారు. వెంటనే పోలీసులు అలర్ట్ అయి దళారులను అరెస్ట్ చేశారు. ఆ మైనర్ అమ్మాయిని రెస్క్యూ హోం కు తరలించారు.