బండి సంజయ్ ఓ పిచ్చి వెధవా… ట్రాక్టర్ ఇప్పిస్త.. దున్నుకోని బతుకుపో

నిన్న బీజేపీ డప్పుల ప్రోగ్రాంలో పాల్గొని డప్పులు కొట్టిన వారిలో ఒక్కరు కూడా అసలైన వారు కాదు. అసలు బీజేపీ వాళ్లు దళితబంధు కావాలని డప్పులు కొడుతున్నారా? వద్దని కొడుతున్నారా? వాళ్లకే తెలియదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేని ఒక మహోన్నత పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతలకు సిగ్గుందా అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ నాయకుల మీద ఫైర్ అయ్యారు. దేశంలో కుల వివక్ష పోగొట్టేందుకు బీజేపీ ఎక్కడైనా ప్రయత్నం చేసిందా.. అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ వల్లే కులవ్యవస్థ ముందుకు నడుస్తోంది. బీజేపీ నేతలకు బుద్ధి ఉందా? ఓట్ల కోసం గారడి వేషాలు వేసే పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.


నా అనుభవంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. దళితులకు వచ్చే లాభాన్ని అడ్డుకునే బీజేపీ వైఖరిని ఖండిస్తున్నా. దళితుల అభివృద్ధికి అడ్డం వస్తే పడేసి తంతారు. బీజేపీ నేతలు పిచ్చి కుక్కల్లా అరుస్తున్నారు. కేసీఆర్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు సాగుతున్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్న బీజేపీ నాయకుల మాటలకు అర్థంపర్థం లేదు అని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ నీకు సిగ్గుందా? నాతో హుజురాబాద్ వస్తవా? అని ఆయన సవాల్ విసిరారు. ఎస్సీ కార్పొరేషన్, స్పెషల్ ఫండ్ వల్ల కంటే.. దళితబంధు వల్ల ఎస్సీలకు ఎంతో ఉపయోగం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో కాదు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి వెళ్లి దళితబంధు కావాలని డప్పులు కొట్టమని బండి సంజయ్ కి మోత్కుపల్లి సూచించారు. సీఎం ఫామ్ హౌజ్ దున్నుతా అంటున్న బండి సంజయ్ కి ఒక ట్రాక్టర్ కొనిపిస్తా అని.. ట్రాక్టర్ దున్ని బతకమని చురకలు వేశారు.

 

మోడీ 15 లక్షలు ఇస్తాడాని పేదలంతా ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. అవి ఇవ్వకపోగా.. కేసీఆర్ 10లక్షలు ఇస్తానంటే అడ్డం వస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మోత్కుపల్లి. దళితబంధు పథకం దేశమంతా బీజేపీ అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలియన్ మార్చ్ చేస్తామంటున్న బీజేపీనేతలు.. మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. పెట్రోల్- డీజిల్ ధరలు రోజువారీగా పెంచడానికి సిగ్గు లేదా? రూ. 450 ఉన్న గ్యాస్ రూ.1000కి పెరిగింది. మోడీ చెప్పే అచ్చేదిన్ రావడం పోను- సచ్చేదిన్ వచ్చింది అంటూ మోత్కుపల్లి ఫైర్ అయ్యారు.