ఆ కమిటీలో నా పేరు 13వ స్థానంలో రాస్తారా.. అందుకే క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లాను

Congress MP Komatireddy Venkat Reddy sensational remarks On the appointment of Revanth

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో హుజురాబాద్ ఫలితం తాలూకు చిచ్చు ఇంకా ఆరిపోలేదు. కనీసం.. డిపాజిట్ కూడా దక్కకుండా ఘోర పరాజయం పాలైన పరిస్థితుల మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఫైర్ అవుతున్నారు. పొలిటికల్ పంచులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు చూస్తుంటే ఉపఎన్నిక ఓటమిపై లోలోపల అంతర్యుద్ధమే నడుస్తుందనిపిస్తుంది. ఓటమికి కారణాలు తేల్చేందుకు కమిటీ వేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ సూచించినా.. కాంగ్రెస్ నేతలు సీనియర్ పీసీసీ తీరుపై మండి పడుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ లకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొరకరాని కొయ్యగా మారారు. ఏకంగా సొంతపార్టీ నేతలే మీడియా ముందు కామెంట్లు చేస్తుననారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

MLA Jeevan Reddy Fires On TPCC President Revanth Reddy
MLA Jeevan Reddy Fires On TPCC President Revanth Reddy

కాంగ్రెస్ పార్టీ అంటే వందేళ చరిత్ర అని.. రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ పార్టీ అనుకుంటే కాదని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తర్వాత ఒక్కసారి కూడా తనను ఏ మీటింగ్ కి పిలవలేదని మండిపడ్డారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఆయన పేరును 13వ స్థానంలో పెట్టడంపై కోమటిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా, క్రీయాశీలకంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ని డమ్మీలను చేయసే కుట్ర జరుగుతందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి సొంత ఎజెండాతో పార్టీ నడిపిస్తున్నారని.. సొంతపాటలు పెట్టుకొని ఈవెంట్లు చేస్తే పార్టీ బలోపేతం కాదని.. పార్టీ ఎజెండా, పార్టీ పాటలతో ప్రజలను మమేకం చేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డిలతో సహా పార్టీలో సీనియర్లను లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ప్రతిసారి అవమానపరుస్తున్నారని.. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు దిగితే ఊరుకోమని కోమటిరెడ్డి హెచ్చరించారు.

komati-reddy-and-revanth-reddy
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నా అవసరం లేదనిపించింది. అందుకే క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లాను అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అసలు టీపీసీసీ అధ్యక్షుడు హుజురాబాద్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదని.. అక్కడ ఒక్క సభ కూడా పెట్టలేదని ఆరోపించారు. కాంగ్రెస్ లో టీడీపీని నింపుతున్నారని.. పార్టీలోని సీనియర్లను కాదని.. వలస వచ్చిన నేతలకు పదవులు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై, మణిక్యం ఠాగూర్, హుజురాబాద్‌ ఫలితంపై పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ, సోనియాగాంధీకి వివరిస్తానన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ కంటే ఆంధ్రలోనే పుంజుకుంటోందన్నారు. పార్టీ బలోపేతంపై అధిష్టానంతో చర్చిస్తానన్నారు.