ముషీరాబాద్ లో ఎంపీ సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు

mp-santhosh-birth-day-celebrations

రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ షరీఫుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న రెయిన్బో హోమ్ లో సంతోష్ కుమార్ జన్మదిన కేకు కట్ చేయడంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.

అలాగే అఖిల్ సాబ్ బాబా దర్గాలో ముఠా గోపాల్, మహమ్మద్ షరీఫుద్దీన్ లు చాదర్ సమర్పించారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో సంతోష్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటారు.