ప్రశాంతతకు మారుపేరు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. జార్ఖండ్లో అత్యధిక పన్ను చెల్లిస్తున్న స్టార్ క్రికెటర్. ప్రపంచంలోని ఏ పెద్ద ఆసుపత్రిలో అయినా చికిత్స తీసుకునే స్థాయి ఉన్నఆటగాడు. అయినా అవన్నీ కాదని ధోని సీక్రెట్ గా నాటు వైద్యం చేయించుకుంటున్నట్టు నేషనల్ మీడియాల్లో వార్తలొస్తున్నాయి. రాంచిలోని స్థానిక నాటు వైద్యుడి వద్ద ధోని తన అనారోగ్యానికి చికిత్స పొందుతున్నాడట. ఎంఎస్ ధోని గత కొన్ని రోజులుగా మోకాలి సమస్యతో బాధపడుతున్నాడు. దీనికోసమే ధోని నాటు వైద్యం చేయించుకుంటున్నాడని టాక్.
ఇక దేశంలోని పెద్ద డాక్టర్ల వద్దకు వెళ్లకుండా ప్రతి 4 రోజులకు ఒకసారి రాంచీకి 70 కి.మీల దూరంలో గల ఓ మారుమూల గ్రామంలోని నాటు వైద్యుడు వందన్ సింగ్ ఖేర్వార్ ను కలుస్తున్నాడట ధోని. ఇందుకు ధోని చెల్లిస్తున్న ఫీజు కేవలం రూ.40 మాత్రమే. అక్కడికి వెళ్లి నాటు వైద్యం చేయించుకుంటున్న ధోని అక్కడి గిరిజనులతో కలిసిపోయి ప్రకృతి రమణీయతను ఎంజాయ్ చేస్తున్నాడు. పొలాల గట్లు చెట్ల కింద గిరిజనులతో కూర్చొని సేదతీరుతున్నాడు. ధోనితో గిరిజనులు ఉన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.