ముంబైలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం

Mumbai: 3 held for gangraping woman .. Read more at: http://timesofindia.indiatimes.com/articleshow/89063373.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మానవ మృగాలు రోజురోజుకూ రెచ్చిపోతున్నాయి. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో దారుణం చోటుచేసుకుంది. శివాజీ నగర్ ప్రాంతం గోవండిలో శనివారం ఉదయం 20 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఇందులో మైనర్లు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

శివాజీ నగర్‌లో ఓ స్లమ్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు అత్యాచారం జరిగినట్టు తెలుస్తోంది. కొంతమంది మహిళలు కేటరింగ్ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా నిందితుల్లో ఒకరు మాట్లాడాలంటూ యువతిని పక్కకు తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులతో కలసి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను అక్కడ వదిలేసి వారంతా పారిపోయారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి తెలియజేసింది. తర్వాత బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

ఈ సమాచారం అందడంతో పోలీసులు.. ముందుగా నిందితులపై కేసు పెట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 10 పోలీసు బృందాలను పంపించి నిందితుల కోసం గాలించారు. శనివారం మధ్యాహ్నం రైలులో పారిపోవడానికి ప్రయత్నిస్తోన్న ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. వారిని విచారించిన తర్వాత ఇంకొక వ్యక్తిని ఆచూకి లభించింది. దాంతో ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతుంది.