రాజ్ కుంద్రా కేసు : ముంబై హైకోర్టు కీలక తీర్పు.. శిల్పాశెట్టి వీడియోలు, ఫొటోలు తీసేయాలని ఆదేశాలు జారీ

mumbai court orders to Tv Channels Remove Shilpa Shetty Photos and Videos Against in Raj Kundra Case
mumbai court orders to Tv Channels Remove Shilpa Shetty Photos and Videos Against in Raj Kundra Case

రాజ్ కుంద్రా కేసు విషయంలో శిల్పాశెట్టి వేసిన పరువు నష్టం దావాపై ముంబై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో ప్రసారం చేశిన శిల్పాశెట్టికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీసివేయాలని యూపీకి చెందిన ఓ టీవీ ఛానల్ కు ఆదేశాలు జారీ చేసింది. తన వీడియోలు, ఫొటోలు రాజ్ కుంద్రా కేసును ఉదహరిస్తూ వాడుకోవడం విషయమై శిల్పాశెట్టి కోర్టును ఆశ్రయించిన వెంటనే పలు ఎంటర్ టైన్మెంట్ ఛానళ్లు శిల్పాశెట్టి వీడియోలు, ఫొటోలను తొలగించాయి. అయితే.. ఈ వ్యవహారంలో శిల్పాశెట్టికి సంబంధించిన వీడియోలు గానీ, ఫొటోలు గానీ మళ్లీ అప్ లోడ్ చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.

mumbai court orders to Tv Channels Remove Shilpa Shetty Photos and Videos Against in Raj Kundra Case
mumbai court orders to Tv Channels Remove Shilpa Shetty Photos and Videos Against in Raj Kundra Case

పోర్న్ వీడియోల కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేయడం బాలీవుడ్ లో సంచలనానికి తెరతీసింది. కొంతమంది మహిళలను భయపెట్టి వారి పోర్న్ చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో వాటిని విడుదల చేస్తున్నట్టుగా ఆయనపై వచ్చిన ఆరోపణల ఆధారంగా ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. జులై 27 వరకు పోలీసు కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రాజ్ కుంద్రా భార్య అయిన శిల్పాశెట్టి సినీ సెలబ్రిటీ కావడంతో పలు టీవీ ఛానళ్లు ఆమె ఫొటోలు, వీడియోలు కూడా ప్రసారంలో వాడుకున్నారు. ఈ విషయంమై శిల్పాశెట్టి కోర్టును ఆశ్రయించింది.
శిల్పా శెట్టి పబ్లిక్ లైఫ్‌లో ఉన్నారని, సెలబ్రెటీ అయిన వారిపై ఇలాంటి కథనాలు ప్రచురించ కూడదని ఆమె తరుపున హాజరైన లాయర్ బిరెన్ సారాఫ్ కోర్టుకు విన్నవించాడు. ఈమేరకు కోర్టు మేం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేదా మీడియాలో ఇలాంటి కథనాలపై ఎలాంటి ప్రకటన జారీ చేయడం లేదని బదులిచ్చింది. ఈ వ్యవహారంలో.. పోలీసుల నివేదిక ప్రకారం.. పరువు నష్టం కలిగించే ప్రకనటలు కావని కోర్టు అభిప్రాయపడింది. ప్రతికా స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యత హక్కు మధ్య సమతుల్యత ఉండాలని జస్టిస్ గౌతమ్ పటేల్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక వాక్ స్వాతంత్ర్యాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలని, వ్యక్తి గోప్యతకు భంగం కలిగించకూడదని కూడా జస్టిస్ గౌతమ్ పటేల్ అన్నారు. అయితే, ఒక వ్యక్తి పబ్లిక్ పర్సనాలిటీ అయితే.. ఆ వ్యక్తి తన గోప్యతా హక్కును త్యాగం చేసినట్లేనని వ్యాఖ్యానించారు.