ఆర్యన్ డ్రగ్స్ కేసులో మరో నలుగురికి ఈ నెల 14 వరకు కస్టడీ విధించిన ముంబై కోర్టు

Mumbai court remands four others In aryan Khan Case
Mumbai court remands four others In aryan Khan Case

షారుక్ ఖాన్ కొడుకు స్నేహితులతో కలిసి క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ చేసుకున్న ఘటనలో ముంబై కోర్టు మరో నలుగురికి పోలీస్ కస్టడీ విధించింది. కేసుకు సంబంధించి ఎన్సీబీ అధికారులు మంగ‌ళ‌వారం నాడు సాయంత్రం న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. నలుగురికి కోర్టు ఈ నెల 14 వ‌ర‌కు ఎన్సీబీ క‌స్ట‌డీకి అప్ప‌గించింది. కొత్త‌గా ఎన్సీబీ క‌స్ట‌డీకి వెళ్లిన వాళ్ల‌లో గోపాల్ జీ ఆనంద్‌, స‌మీర్ సెహ‌గ‌ల్‌, మాన‌వ్ సింఘాల్‌, భాస్క‌ర్ అరోరా ఉన్నారు.

Mumbai court remands four others In aryan Khan Case
Mumbai court remands four others In aryan Khan Case

కాగా ఈరోజు ఎన్సీబీ కస్టడీకి వెళ్లిన నలుగురు నిందితులు క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ నిర్వహించిన ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి చెందిన వాళ్లని ఎన్సీబీ చెప్పింది. నిన్న ఉదయం కూడా అధికారులు వీరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వారిని నిన్ననే కోర్టులో హజరు పరచగా.. ఈ నెల 11వరకు కంపెనీకి చెందిన నలుగురిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 16 మందినిఅరెస్ట్ చేశారు.