షారుక్ ఖాన్ కొడుకుకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ.. బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ

Mumbai Court Sents Aryan Khan to Judicial Custody
Mumbai Court Sents Aryan Khan to Judicial Custody

క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో ఆర్యన్‌ సహా ఎనిమిది మంది నిందితులకు ముంబయి కోర్టు జ్యుడిషియిల్‌ కస్టడీ విధించింది. ఈ నెల 11వరకు తమ కస్టడీకి ఇవ్వాలన్న ఎన్సీబీ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్బంధ విచారణ అవసరం లేదని.. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారని న్యాయమూర్తి తెలిపారు. జ్యుడిషియల్‌ కస్టడీ విధించిన నిమిషాల వ్యవధిలోనే ఆర్యన్‌ తరఫు న్యాయవాది సతీశ్‌ మానేశిందే మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు ఉదయం 11గంటలకు విచారణ జరుగనుంది.

Mumbai Court Sents Aryan Khan to Judicial Custody
Mumbai Court Sents Aryan Khan to Judicial Custody

ఆర్యన్ తో పాటు మిగిలిన నిందితులను జైలుకు తరలించేందుకు కొవిడ్ నిబంధనల నేపథ్యంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అప్పటి వరకు వారిని ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయంలో ఉంచనున్నారు. ఎన్సీబీ కార్యాలయంలో వారికి కుటుంబ సభ్యులను కలిసేందుకు న్యాయమూర్తి అనుమతించారు. గోవాకు చెందిన క్రూజ్‌ నౌకలో రేవ్‌ పార్టీపై ఎన్సీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఆర్యన్‌ ఖాన్‌, మూన్‌మూన్‌ ధామేచ, అర్బాజ్‌ మెర్చంట్‌ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వీరిని ఇటీవల కోర్టులో హాజరు పరచగా.. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్సీబీకి అప్పగించింది. ఆ కస్టడీ నేటితో ముగియడంతో మరోసారి నిందితులను అధికారులు కోర్టులో హాజరుపరచగా.. ఆర్యన్‌ సహా ఎనిమిది మందికి న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.