ముంబై ఇండియన్స్ స్కోరు 10 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు

సన్ రైజర్స్ మీద 171 పరుగుల తేడాతో గెలవాలన్న లక్ష్యంతో టాస్ గెలవగానే బ్యాటింగుకు దిగిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసే దిశగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ గా బ్యాటింగ్ కి వచ్చిన ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్సులతో 84 పరుగులు చేసి క్రీజులో ఉన్నంత సేపు ధూమ్ ధామ్ చేశాడు. రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యా నిరాశపరిచినా.. పోలార్డ్, సూర్య కుమార్ యాదవ్ మ్యాచును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు.

తొలి 8 ఓవర్లలో స్కోర్ బోర్డు శరవేగంగా పరుగెత్తినా.. ఇషాన్ కిషన్ వికెట్ పడటంతో స్కోర్ కాస్త నెమ్మదించింది. 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ స్కోర్ 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఇదే జోరు కొనసాగితే.. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లోనే అత్యధిక స్కోరు కొట్టిన జట్టుగా రికార్డు సృష్టించడం ఖాయమే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.