42 పరుగులతో ముంబై ఇండియన్స్ ఘనవిజయం

టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 235 చేసి.. సన్ రైజర్స్ హైదరాబాద్ కి భారీ లక్ష్యాన్నిచ్చింది. ఇషాన్ కిషన్ (84), సూర్యకుమార్ యాదవ్ (82) రెచ్చిపోయి ఆడటంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. కాగా.. లక్ష్య చేధనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వేగంగానే ఆడింది. ఒక దశలో మ్యాచ్ గెలుస్తుందేమో అనేంత స్పీడుగా రన్ రేట్ మెయింటెన్ చేసింది.

జేసన్ రాయ్ (34), అభిషేక్ శర్మ (33), మనీష్ పాండే (69), ప్రియం గర్గ్ (29)లు డేరింగ్ బ్యాటింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బూమ్రా 2, నైల్ 2, నీషమ్ 2, బౌల్ట్ 1, చావ్లా 1 వికెట్ తీసి.. సన్ రైజర్స్ ని ఓడగొట్టారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి చెందిన ఆల్ రౌండర్ మహ్మద్ నబీ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ లో ఒకే మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన నాన్ వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు.