ఐపీఎల్ 2021 సెకండ్ సెషన్ లో భాగంగా ఈరోజు రెండు మ్యాచులు ఒకేసార జరుగుతున్నాయి. ఐపీఎల్ చరత్రలోనే రెండు మ్యాచులు జరుగడం ఇదే తొలిసారి. రెండు మ్యాచుల్లో భాగంగా అబుదాబీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచులో ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ కనుక సన్ రైజర్స్ మీద 171 పరుగుల తేడాతో గెలిస్తే ముంబై ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. ఆడిన 13 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ 6 గెలవగా.. 7 ఓడిపోయి.. 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. రెండు జట్ల మధ్య జరిగిన ముఖాముఖి పోరులో 17సార్లు పోటీపడగా.. 9 సార్లు ముంబై.. 8సార్లు హైదరాబాద్ గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్ కి మనీష్ పాండే కెప్టెన్ గా వ్యవహరించనుండటం విశేషం.
సన్ రైజర్స్ హైదరాబాద్: జేసన్ రాయ్, అభిషేక్ శర్మ, మనీష్ పాండే (కెప్టెన్), ప్రియం గార్గ్, అబ్దుల్ సమద్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, ట్రెంట్ బౌల్ట్