నా జోలికొస్తే ఊరుకోను.. మోహన్ బాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగబాబు

Naga babu Strong Counter To Mohan Babu About Maa Building Issue
Naga babu Strong Counter To Mohan Babu About Maa Building Issue

మా ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఇండస్ట్రీలో వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో మా అధ్యక్షులుగా పనిచేసిన వారు అసోసియేషన్ బిల్డింగ్ చాలా తక్కువ ధరకు అమ్మేశారంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై మెగా సోదరుడు నాగబాబు ఫైర్ అయ్యారు. బిల్డింగ్ వ్యవహారం గురించి తనకేం తెలియదని.. ఆ విషయంలో తన జోలికొస్తే ఎవరైనా ఊరుకోనని గట్టి వార్నింగ్ ఇచ్చారు. బిల్డింగ్ అమ్మకం వ్యవహారం మొత్తం నరేష్, శివాజీరాజాలకే తెలుసని నాగబాబు అన్నారు. దమ్ముంటే మా భవనం అమ్మకం గురించి నరేష్ ను ప్రశ్నించాలని సూచించారు. తనకు సంబంధం లేని వ్యవహారంలో తన ప్రస్తావన తెస్తే ఊరుకోనని మండిపడ్డారు ఫైర్ బ్రాండ్ నాగబాబు.

Naga babu Strong Counter To Mohan Babu About Maa Building  Issue
Naga babu Strong Counter To Mohan Babu About Maa Building Issue

గత నెలలోనే మా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశం మీద మా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజు సమక్షంలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో మా సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ మీటింగులో ఎక్కువ మొత్తానికి మా భవనాన్ని కొని.. తక్కువ ధరకే ఎందుకు అమ్మారు? ఇండస్ట్రీ పెద్దలు అప్పుడు ఎందుకు నోరు మెదపలేదని మోహన్ బాబు ప్రశ్నించారు. మోహన్ బాబు ప్రశ్నకు నాగబాబు స్పందించాడు. బిల్డింగ్‌ కొనుగోలు చేసినప్పుడు అధ్యక్షుడిగా నేను ఉన్నాను. పెద్దల సూచనలు, అప్పటి అవసరాలను దష్టిలో ఉంచుకొని రూ.71.73 లక్షలతో భవనాన్ని కొన్నాం. ఇంటీరియర్ కోసం మరో రూ.3 లక్షలు ఖర్చు చేశాం. 2008లో నా మా అధ్యక్ష పదవి గడువు పూర్తయింది. నేను అధ్యక్ష పీఠం నుంచి దిగిన తర్వాత మా వ్యవహరాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదు. జోక్యం చేసుకోలేదు. మా అభివృద్ధికి కావాల్సిన సలహాలు ఇచ్చాను. బిల్డింగ్‌ వ్యవహరమంతా నరేష్, శివాజీ రాజాలే చూసుకున్నారు. శివాజీరాజా అధ్యక్షుడిగా నరేశ్‌ కార్యదర్శిగా ఉన్నప్పుడే బిల్డింగ్‌ అమ్మకానికి పెట్టి.. రూ.30 లక్షలకు అమ్మారు. సో.. మీరు వెళ్లి వారిని అడగండి. నాకు సంబంధం లేని విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేస్తే నేను తీవ్రంగా స్పందిస్తా అంటూ నాగబాబు అన్నారు.