చంద్రబాబు కన్నీళ్లపై.. నాగబాబు సీరియస్..!

Nagababu Reaction On Chandrababu Incident In AP Assembly
Nagababu Reaction On Chandrababu Incident In AP Assembly

ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో బూతుల పర్వం హద్దులు దాటి.. కుటుంబంలోని ఆడవారిపై దూషణలకి దిగటం సంచలనంగా మారింది. చంద్రబాబు కన్నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెగలు పెట్టిస్తుంది. అసెంబ్లీ సాక్షిగా వైస్సార్ పార్టీ వారు తన భార్య నారా భువనేశ్వరిని దూషించారని మీడియా ముఖంగా బాబు వెక్కి వెక్కి ఏడవగా.. టిడిపి కార్యకర్తలు వైసిపి నాయకులపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
టీడీపీ నాయకులు, నందమూరి ఫ్యామిలీ మొత్తం రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లోని సెలబ్రెటీలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఇన్సిడెంట్ పై మెగా బ్రదర్ నాగబాబు స్పదించాడు. ‘ఈ రోజు రాష్ట్ర రాజ‌కీయ చ‌రిత్రలో ఇది ఎంతో దుర్దినం. చంద్రబాబు మా ప్రత్యర్థి అయి ఉండొచ్చు.. టీడీపీ తమకు ప్రతిపక్షం అయ్యుండొచ్చు.. కానీ, చంద్రబాబునాయుడు వంటి ఒక నేత ఇలా కన్నీటిపర్యంతం అయిన ఘటన తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. జగన్ మోహన్ రెడ్డి వంటి ముఖ్యమంత్రిని కూడా ‘భో**** కె’ అని దూషించి, ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అసభ్యకర పదజాలంతో తిట్టి అసెంబ్లీ సంస్కృతిని హననం చేయొద్దు. గతంలో నా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌‌ను, నా కుటుంబాన్ని ఇలాగే అనుచితంగా విమర్శించినప్పుడు ఎంతో క్షోభకు గురైన వ్యక్తిగా.. ఆ బాధను అనుభవించిన వ్యక్తిగా చెప్తున్నాను. ఇది అనాగరికం.. సాటి మనుషుల పట్ల క్రూరత్వం. ఏ పార్టీ అయినా సరే… ఏ నాయకుడైనా సరే … తోటివారి పట్ల కనీస గౌరవాన్ని పాటించి ఇకనైనా మనుషులుగా మారుతారని ఆశిస్తున్నా!’’ అంటూ నాగబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.