చిరంజీవికి మీ అంత అహంకారం లేదు.. రాజీనామా తరువాత.. తొలిసారి నాగబాబు సీరియస్..!

Nagababu Counter To Naresh And Mohan Babu
Nagababu Counter To Naresh And Mohan Babu
Nagababu Counter To Naresh And Mohan Babu
Nagababu Counter To Naresh And Mohan Babu

ఎన్నికల ఫలితాల తరువాత ‘మా’ గొడవలు సద్దుమణుగుతాయనుకుంటే.. ఇప్పుడు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల ముందుకంటే మించిన యుద్ద వాతావరణం నెలకొంది. విద్వేషాలు రెచ్చగొట్టి మంచు విష్ణు గెలిచారని.. మా సభ్యత్వానికి మూకుమ్మడి రాజీనామాలు చేసి ప్రకాశ్ రాజ్ ప్యానల్ సంచలనం సృష్టించగా..          మోహన్ బాబు మమ్మల్ని బూతులు తిడుతూ కొట్టడానికి వచ్చారని ప్రకాశ్ ప్యానల్ సబ్భ్యులు బహిరంగ విమర్శలకి దిగి మా పాలిటిక్స్ ని హీటెక్కించారు. అయితే ఇదంతా కూడా విష్ణు ప్యానల్ కి సపోర్ట్ చేస్తూ.. ఇండస్ట్రీకి ఒక సమస్యగా మారిన నరేష్ కారణంగానే గొడవలు అవుతున్నాయని అని కూడా సభ్యులు ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి మెగా హీరోలని దూరం చేయాలనీ నరేష్ చూస్తున్నాడని.. అందుకే మెగాస్టార్ ని ప్రతిసారి అవమానిస్తూ మాట్లాడుతున్నాడని.. ఇందులో భాగంగానే దాసరి లేని లోటు మోహన్ బాబు తీర్చబోతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని విమర్శలొస్తున్నాయి. అయితే తాజాగా నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలకి నాగబాబు కౌంటర్ ఇచ్చాడు. మా అన్నయ్య ఎప్పుడు పెద్దగా ఉండాలనుకోలేదు.. సమస్యలున్నాయి పరిష్కరించండంటూ వచ్చినవారికి సహాయం చేశాడంతే… చిరంజీవికి మీ అంత ఈగో లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు నాగబాబు.

ప్రకాష్ రాజ్ సభ్యుల రాజీనామా అనంతరం తొలిసారి మీడియాతో ముచ్చటించిన మెగా బ్రదర్‌ నాగబాబు, నరేశ్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. ‘పరిశ్రమకు చెందిన నటీనటులు, అభిమానులు ఎవరైనా కష్టమంటు ఇంటికి వస్తే అన్నయ్య వారికి చేతనైనంత సాయం చేశాడు. అంతేకాని పెద్దరాయుడులా సింహాసనంపై కూర్చోవాలని, పెద్దరికం చెలాయిస్తానని ఆయన ఎప్పుడు అనలేదని అన్నాడు నాగబాబు. నంతరం తన రాజీనామాపై మాట్లాడుతూ.. ‘‘మా’ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో గర్వపడ్డాను. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదని, విశాల హృదయంతో వ్యవహరిస్తారనుకున్న. కానీ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇంత సంకుచితంగా, కుసంస్కారంగా ఆలోచించే వారి మధ్యలో నేను ఉండలేను. మా సభ్యులు ప్రాంతాలకి అతీతంగా ఓట్లేస్తారుకున్న.. కానీ నాకు సరిగ్గా బుద్దొచ్చేలా చేశారు. ఇకపై మా అసోసియేషన్‌తో నాకు సంబంధం ఉండదు’ అంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు నాగబాబు.