నాగార్జున సాగర్ 4 గేట్లు ఎత్తివేత.. 32,316 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల - TNews Telugu

నాగార్జున సాగర్ 4 గేట్లు ఎత్తివేత.. 32,316 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలనాగార్జున సాగర్ రిజర్వాయర్ కు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులు ఉంది. వరద నీరు ఇంకా వచ్చి చేరుతుండటంతో డ్యామ్ నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 32,316 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Nagarjuna Sagar Gates Opened
Nagarjuna Sagar Gates Opened

సాగర్ రిజర్వాయర్ నుంచి 8,529 క్యూసెక్కు ల వరద నీరు కుడి కాల్వ ద్వారా , 7353 క్యూసెక్కు లు ఎడమ కాల్వ ద్వారా , 1800 క్యూసెక్కులు ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 400 క్యూసెక్కులు వరద కాల్వ ద్వారా, 28,745 క్యూసెక్కుల నీటిని ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా వరద నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం 79,143 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా ఇన్ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 882.70 అడుగులు (202.9673 టీఎం సీలు) ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 492.51 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.