నాగార్జున సీరియస్ అవ్వటంతో.. సిగ్గుతో తలదించుకున్న యాంకర్ రవి.. బండారమంతా బయటపెట్టేసాడుగా..!

Nagarjuna Serious On Anchor Ravi In Bigg Boss
Nagarjuna Serious On Anchor Ravi In Bigg Boss
Nagarjuna Serious On Anchor Ravi In Bigg Boss
Nagarjuna Serious On Anchor Ravi In Bigg Boss

ఒకవైపు మా ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ క్రికెట్ హంగామాల కారణంగా కొన్ని రోజులు బిగ్ బాస్ కి బ్యాడ్ టీఆర్పీఎస్ వచ్చాయి. బిగ్ బాస్ కంటే కూడా ఈ రెండు అంశాలపైనే జనాలు ఎక్కువగా మక్కువ చూపెట్టారు. ఇక తాజాగా ఈ రెండు ఘట్టాలు పూర్తవ్వటంతో మెల్లిగా బిగ్ బాస్ కూడా పుంజుకుంటుంది. వీకెండ్ స్పెషల్ లో భాగంగా ఉండే నాగార్జున ఎపిసోడ్స్ తాలూకు ప్రోమోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులందరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంచాల‌కులు త‌ప్పు చేస్తే బిగ్‌బాస్ అన‌ర్హ‌త వేటు వేస్తాడ‌ని ఇంటి స‌భ్యుల‌కు క్లారిటీ ఇస్తూనే అందరిపై ఒట్టు వేయటం ఏంటని యాని మాస్టర్ పై ఫైర్ అయ్యాడు నాగ్. ఇక యాక్ట‌ర్స్ అంటూ చిన్న‌చూపా? అని మొన్న శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడ్డాడు నాగార్జున.

మరోవైపు హౌస్ ప్రాపర్టీస్ ని ధ్వసం చేయటం తప్పని తెలియదా అంటూ లోబోకి క్లాస్ పీకాడు నాగార్జున. దీంతో యాంకర్ రవి చెప్తేనే అలా చేశానంటూ కౌంటర్ ఇస్తున్న లోబోపై మరింత చిందులు తొక్కాడు. రవి గడ్డి తినమంటే తింటావా అంటూ లోబోపై సీరియస్ అయ్యాడు నాగార్జున. ఇక లోబోకి ఈ ఐడియా ఇచ్చిన యాంకర్ రవిపై విరుచుకుపడ్డాడు నాగార్జున. ఎందుకలా సలహా ఇచ్చావ్ అంటూ రవిని అడుగుతుంటే.. మధ్యలోనే రవి కలుగచేసుకుని శ్వేత కూడా కుష‌న్స్ క‌ట్ చేస్తుంద‌న్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని ఎదో చెప్తుండగా.. నేను కూడా త‌న ఐడియానే ఫాలో అవుతున్నా అంటూ రవిని ఇరికించేసింది శ్వేత. దీంతో నాగార్జున రవి గాలి తీసేశాడు. హౌస్ మేట్స్ మాటలు వింటుంటే..అప్పట్లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ రవిని గుంటనక్క అని చేసిన కామెంట్స్ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అన్నట్టు వ్యాఖ్యానించాడు. దీంతో సిగ్గుతో తలదించుకున్నాడు యాంకర్ రవి. ప్రోమోతోనే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ ఎపిసోడ్ శనివారం టెలికాస్ట్ అవ్వనుంది.