ఆ చిన్న కారణంతోనే బంధం తెగిందా.. ఇన్నేళ్లకు బయటపడ్డ.. బాలయ్య విజయశాంతిల విభేదాలు..!

Balakrishna Vijayashanthi Clash After Nippu Ravva Movie
Balakrishna Vijayashanthi Clash After Nippu Ravva Movie
Balakrishna Vijayashanthi Clash After Nippu Ravva Movie
Balakrishna Vijayashanthi Clash

తెలుగు తెరపై కొన్ని ఫెవరెట్ జోడీలు ఉంటాయి. ఒక్క సినిమాలో హిట్ అవుతే చాలు ఆ సదురు హీరో హీరోయిన్లది హిట్ పెయిర్ అయిపోతుంది. ఇక వారిద్దరిమధ్య కెమిస్టీ కలిసిందో.. ఆ జోడికి తెగ మార్కెట్ క్రియేట్ అయిపోతుంది. టాలీవుడ్ లో అలాంటి సూపర్ హిట్ జోడీనే నందమూరి బాలకృష్ణ, విజయశాంతిలది. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలని చేస్తూ.. లేడి అమితాబ్ గా పేరుతెచ్చుకున్న విజయశాంతి బాలయ్యతో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. వీరి కాంబినేషన్ లో దాదాపుగా 17 సినిమాలు వచ్చాయి. ‘కథానాయకుడు’ సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించగా, ‘నిప్పురవ్వ’ చివరి చిత్రం.. ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వీరి ఖాతాలో ఉన్నాయి. అయితే నిప్పురవ్వ చిత్రం తరువాత ఈ కాంబినేషన్ మళ్ళీ తెరపై కనిపించలేదు విజయశాంతి. బాలయ్య విజయశాంతి మధ్యలో నిప్పురవ్వ తరువాత విభేదాలు వచ్చాయని అందుకే విజయశాంతిని బాలయ్య పక్కన పెటేసాడని అప్పట్లో వార్తలొచ్చాయి.

ఈ రూమర్స్ పై తాజాగా లేడి ఫైర్ బ్రాండ్ విజయశాంతి స్పందించింది. బాలయ్యతో తనకెలాంటి వివాదాలు లేవని.. తన మార్కెట్ పెరగడంతో.. కేవలం లేడి ఓరియెంటెడ్ చిత్రాలనే చేశానని.. హీరోల చిత్రాలకి హీరోయిన్ గా చేయటం ఆపేసానని చెప్పింది విజయశాంతి. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె మాట్లాడుతూ.. నిప్పురవ్వ చిత్రం తర్వాత తన రెమ్యునరేషన్ పెరిగిందని, ఇమేజ్ కూడా పెరగడం, హీరోయిన్ బేస్ సినిమాల పైన ఫోకస్ చేశానని అందుకే మళ్ళీ బాలయ్య కాంబినేషన్ లో సినిమా రాలేదని చెప్పుకొచ్చారు. అంతేతప్ప ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు విజయశాంతి. ఇక చాల ఏళ్ళ తరువాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. బాలయ్య చిత్రంలో నటిస్తే చూడాలని ఉందంటూ ఈ జోడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.