బన్నీ కాదు.. ఇండియాలో నానినే నెంబర్ వన్.. ఇదో​ అద్భుత రికార్డ్..!

Nani Shyam Singha Roy Movie Sets New Records In Netflix
Nani Shyam Singha Roy Movie Sets New Records In Netflix

న్యాచురల్ స్టార్ నాని.. సొంత కష్టంతో టాలీవుడ్ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. మంచి కామెడి టైమింగ్, భాషపై పట్టు, గుడ్ స్టోరీ సెలెక్షన్స్ హీరో నాని సక్సెస్ సీక్రెట్స్. అలా మొదలైంది, పిల్లజమీందార్, భలే భలే మగాడివోయ్ వంటి కామెడి సినిమాల్లో రాణిస్తూ వస్తున్న నాని.. గేర్ మార్చి కంటెంట్ కథలని కూడా చేస్తూ తన స్థాయిని రెట్టింపు చేసుకుంటున్నాడు. నిన్ను కోరి, గ్యాంగ్ లీడర్, జెర్సీ వంటి ఎక్స్‌పెరిమెంటల్ చిత్రాలతోను సూపర్ హిట్స్ కొడుతున్నాడు. టాలీవుడ్ లో సీరియస్ కథలతో క్రేజ్ పెంచుకుంటూ పోతున్న నాని మార్కెట్ ని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలై థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓ అరుదైన ఫీట్ సాధించి వార్తల్లో నిలిచింది. ఫస్ట్ షోతోనే బాక్సాఫీస్ దెగ్గర బొమ్మ బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకోగా ఓటిటిలోను శ్యామ్ సింగరాయ్ దుమ్ముదులుపుతుంది.

జనవరి 21 నుంచి ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో శ్యామ్ సింగరాయ్ ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీని కంటే ముందు ‘టక్ జగదీశ్’ చిత్రం థియేటర్ విడుదల కోసం పడని పాట్లు పడి చివరికి ఓటిటిలోనే విడుదల చేయగా.. ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. దీంతో భారీ అంచనాలతో విడుదలైన శ్యామ్ సింగరాయ్ బాక్సాఫీస్ తో పాటు ఓటిటి వేదికలోను భారీ రెస్పాన్స్ అందుకుంది. మొదటి వారంలో ఎక్కువ మంది వీక్షించిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది శ్యామ్ సింగరాయ్. నెట్‌ఫ్లిక్స్‌ లో మొదటి మూడు రోజుల్లోనే 3.6 వ్యూయింగ్ అవర్స్ తో టాప్ 10లో నిలిచి.. ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో సత్తా చాటింది. ఇప్పుడు తాజాగా ప్రపంచం మొత్తం మీద నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమ్ అయిన అన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో తొలి వారం రోజుల్లో అత్యధిక మంది వీక్షించిన జాబితాలో టాప్ 3 స్థానంలో నిలవడమే గాక టాప్ 10 ప్లేస్లో ఒకటిగా నిలిచింది. తద్వారా ఇండియా నుంచి టాప్ 3 స్థానాన్ని పొందిన మొట్ట మొదటి సినిమాగా నాని శ్యామ్ సింగరాయ్ సరికొత్త రికార్డుని నెలకొల్పడం విశేషం.