నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది: నరసాపురం ఎంపీ

jagan-and-raghurama

ఏపీ సీఎం జగన్‌పై విరుచుపడే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌కు చెందిన వ్యక్తులతో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని నరసాపురం ఎంపీ ఆరోపించారు.

ఏపీలో సీఎం జగన్ వ్యవస్థ నచ్చకపోతే వ్యవస్థను, వ్యక్తి నచ్చకపోతే వ్యక్తిని తీసేస్తారని తెలిపారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో ప్రధాని మోడీకి లెటర్ రాస్తానన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక రాష్ట్రంలో జగనన్న పథకాలను కొనసాగించలేరన్న ఆయన.. పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష నేతలను వేధించేందుకు, కేసులు పెట్టేందుకే వినియోగిస్తున్నారని చెప్పారు.

చిరంజీవిని అల్లరి చేయించడానికే ఆయనకు రాజ్యసభ అవకాశం ఇస్తున్నట్టు  ఓ పత్రికలో కథనం రాయించారని పరోక్షంగా జగన్ పై మండిపడ్డారు. చిరంజీవి చెప్పకపోతే ముఖ్యమంత్రికి సినిమా కష్టాలు తెలియవా? అంటూ ఎంపీ ప్రశ్నించాడు.