పదోతరగతి ప్రశ్నాపత్నం లీక్ కేసులోనే నారాయణ అరెస్టు: చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డి

మాజీమంత్రి నారాయణను కస్టడీలోకి తీసుకున్నామని ఎస్పీ రిశాంత్‌రెడ్డి వెల్లడించారు. చిత్తూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్టు చేశామని, పదోతరగతి ప్రశ్నపత్నం లీక్ కేసులో అరెస్టు చేశామని,  ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తీసుకుని మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని వివరించారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారమే మాల్ ప్రాక్టీస్‌ జరిగింద ని,అటెండర్లు, సహాయ సిబ్బంది ద్వారా మాల్ ప్రాక్టీస్‌ జరిగిందన్నారు. కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశామని, మిగతా విద్యాసంస్థల పాత్రపైనా దర్యాప్తు  చేపట్టినట్లు తెలిపారు. నిందితులపై సెక్షన్ ఐపీసీ 409 ,408 120,207 తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు నిర్ధారణ అయితే నిందితునికి పది సంవత్సరాలపాటు జైలుశిక్ష పడే అవకాశాలు ఉందన్నారు.

ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో ప్రమేయమున్న అందరినీ అరెస్టు చేస్తామని, గతంలోనూ ఇలా లీక్ చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని రిశాంత్‌రెడ్డి వివరించారు. లాంగ్వేజ్‌ల్లో ఎక్కువ మార్కుల కోసమే ఇలా చేశారని భావిస్తున్నామని, నారాయణ సతీమణిని తాము అరెస్టు చేయలేదని,  ప్రశ్నపత్రాల కేసులో చాలామంది పాత్ర ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.