హేమపై ముప్పేట దాడి.. మా ఎన్నికల్లో మరో దుమారం..!

Naresh And Jeevitha Rajasekhar Fires On Hema Voice Message
Naresh And Jeevitha Rajasekhar Fires On Hema Voice Message
Naresh And Jeevitha Rajasekhar Fires On Hema Voice Message
Naresh And Jeevitha Rajasekhar Fires On Hema Voice Message

మా అధ్యక్ష ఎన్నికల పేరు మీద సినీ ఇండస్ట్రీ సభ్యులు రచ్చకెక్కుతున్నారు. సాధారణ రాజకీయ ఎన్నికల వేడిని తలపిస్తూ ఏకంగా ఐదుగురు అధ్యక్షసభ్యులు ఎన్నికల బరిలో దిగడమే కాకుండ ఇండస్ట్రీ సభ్యులను ఐదు వర్గాలుగా చీల్చి చెడుగుడు ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా హేమ ఆడియో టేప్ ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపింది. మా అధ్యక్షుడు నరేష్ పై సంచనలం ఆరోపణలు చేసింది హేమ. మా’ నిధుల్లో ఉన్న 5కోట్లలో ఇప్పటివరకు నరేష్ ఖర్చుచేసింది 3కోట్లు మాత్రమే. మరి మిగితా 2కోట్ల పరిస్థితి ఏంటి.. దాని లెక్కలు ఎలా.. ఖచ్చితంగా ఆ రెండు కోట్లు ఎక్కడ దేనికి ఖర్చు చేసారో చెప్పాలి. అసలు నరేష్ కి అధ్యక్ష ఎన్నికలు జరగడమే ఇష్టం లేదని.. హాయిగా మరో టర్మ్ కూడా అతనే పదవిలో ఉండాలనుకుంటున్నాడని గుట్టు రట్టు చేస్తూ హేమ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇంకా మిగిలి ఉన్న డబ్బుని కూడా వాడుకోవాలని నరేష్ చూస్తున్నాడని, అతని ఆటలు సాగనివ్వమని నరేష్ పై హేమ ఫైర్ అయింది.

అయితే దీనికి కౌంటర్ గా ఇప్పుడు నరేష్ వర్గం నుండి హేమపై ముప్పేట దాడి మొదలైంది. మా అధ్యక్షుడు నరేష్, జీవిత రాజశేఖర్ లు హేమ వ్యాఖ్యలపై వరుస ప్రెస్ నోట్లతో సీరియస్ అయ్యారు. హేమ వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు నరేష్ స్పందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ గౌరవ మర్యాదలను దెబ్బతీసేలా హేమ మాట్లాడారని నరేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. హద్దులు మీరి మాట్లాడిన హేమపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని.. ఈ మేరకు క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని నరేష్ అన్నారు. ఇక కరోనా కారణంగానే మా ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని .. దీని వెనుక హేమ ఆరోపించినట్టు ఇతర ఉద్దేశాలేవి లేవని, కరోనా దృష్ట్యా ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు నరేష్. సుప్రీం కోర్ట్, హై కోర్టులు కూడా కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణ వద్దంటూ తీర్పులు ఇచ్చారని నరేష్ గుర్తుచేశాడు.

 

ఇక హేమపై జీవిత రాజశేఖర్ కూడా సీరియస్ అయ్యారు. సమస్యలు వచ్చినప్పుడు మేము మీడియాకి ఏకొద్దు అంటూ అందరం నియమం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు తప్పడం లేదు. హేమ చేసిన అబద్దపు ఆరోపణలపై స్పందించకపోతే అవే నిజమవుతాయని అందుకే మీడియా ముందుకొచ్చానని జీవిత చెప్పింది. హేమ మాటలు చాలా తప్పుగా అనిపించాయని జీవిత అన్నారు. ‘మా’ నిర్ణయాలను పట్టించుకోకుండా హేమ మీడియాకి ఏందుకు వచ్చింది.? అని జీవిత ప్రశ్నించించారు. ఎలక్షన్స్ ఎవరు పెట్టమంటున్నారు.? ఎందుకు మా సభ్యులను కన్ఫ్యుజ్ చేస్తున్నారు.? మేము కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఈ టర్మ్‌‌‌లో కోటి రూపాయలు ఫండ్ సమకుర్చాము అని చెప్పింది జీవిత రాజ్ శేఖర్.