‘మా’ ఎలక్షన్స్ ముందు మంచి పార్టీ. ఏంటో మరి మతలబు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఐతే ఎన్నికలకు ముందు హీట్ పెరిగింది. దాదాపు ఐదు మంది పోటీకి సై అంటున్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లు అయితే సై అంటే సై అంటూ ఎన్నికల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసున్నారు. అటు జీవిత రాజశేఖర్, హేమ, సీఎల్ఎన్ కూడా పోటీలో ఉంటామని చెప్పారు. పైగా ఎవరికీ వారు ప్రచారం కూడా చేసేస్తున్నారు. ఐతే పోటీలో ఉన్న వారు కాకుండా ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ వీకెండ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆయన పేరుతో పార్టీకి అందరినీ ఆహ్వానిస్తూ వాట్సాప్ లో కూడా మెస్సేజ్ పెట్టారు. శనివారం రాత్రి దసపల్లా హోటల్ లోని ఫోరమ్ హాల్ లో పార్టీ జరగనున్నట్లు నరేష్ విజయ కృష్ణ పేరుతో చాలా మందికి మెస్సేజ్ లు వచ్చాయి.

మతలబు ఏందో?

నిజానికి ఎలక్షన్స్ లో పోటీ చేసేవారు పార్టీ ఇవ్వాలి. కానీ ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మళ్లీ పోటీ చేయటం లేదు. మరి ఆయన ఎందుకు పార్టీ ఇస్తున్నాడన్నది హాట్ టాఫిక్ గా మారింది. ఇప్పటికే నరేష్ తో ప్రకాష్ రాజ్, హేమ మాటల యుద్ధానికి దిగారు. కావాలనే ఆయన ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారని ప్రత్యక్షంగా కామెంట్లు చేశారు. పైగా ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు తెలపటాన్ని నరేష్ వ్యతిరేకించాడు. దీంతో నరేష్ ఇచ్చే పార్టీ ఎవరి అనుకూలంగా ఉండబోతుందన్నది ఆసక్తి మారింది. నరేష్ మద్దతు కచ్చితంగా మంచు విష్ణుకే ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పార్టీ పేరుతో నరేష్ తన మద్దతుదారులను విష్ణుకు సపోర్ట్ చేయాలని కోరే అవకాశం ఉండొచ్చంటూ ప్రచారం జరుగుతోంది.