నాసా ‘డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్’.. 5 ల‌క్ష‌ల డాల‌ర్ల బ‌హుమ‌తి

నాసా ‘డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్’

అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్రకటించింది. దీనికి ‘డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్’ అనే పేరు పెట్టారు. ఈ చాలెంజ్ గెలిచిన వారికి 5 ల‌క్ష‌ల డాల‌ర్లు(రూ.3.6 కోట్లు) బ‌హుమ‌తి ఇస్తానని ప్రకటించింది.

అసలు చాలెంజ్ ఏంటంటే..

మార్స్ పైకి ఆస్ట్రోనాట్ల‌ను పంపించే ప్రాజెక్టును నాసా చేపట్టింది. అయితే మార్స్ పైకి వెళ్లి రావడానికి క‌నీసం మూడేండ్లు ప‌డుతుంది. అంత సుదీర్ఘ కాలంపాటు ఆస్ట్రోనాట్ల‌కు సరిపడా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అందించాలంటే మామూలు విషయం కాదు. అల్ట్రా హై కేల‌రీ చాక్లెట్ బార్ల‌ను నాసా సిద్ధం చేసినా.. వీటిని పెద్ద సంఖ్యలో పంపాలంటే రాకెట్ బ‌రువు పెరుగుతుంది. అందుకే కొత్త వ్య‌వ‌స్థ‌లు, టెక్నాల‌జీల‌ సాయంతో స్పేస్ మిష‌న్ల‌లో ఆస్ట్రోనాట్ల ఆహారానికి సంబంధించి వినూత్న ఆలోచ‌న‌లను నాసా ఆహ్వానిస్తోంది.

ఎప్పటిలోగా అంటే..

నాసాతో  తమ వినూత్న ఆలోచనలను పంచుకోవాల‌ని అనుకుంటున్న వాళ్లు మే 28 లోగా రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత జులై 30లోపు త‌న వినూత్న ప్రాజెక్టులను నాసాకు అందించాల్సి ఉంటుంది. టాప్ 20 టీమ్స్ కు 25 వేల డాల‌ర్ల చొప్పున మొత్తం 5 ల‌క్ష‌ల డాల‌ర్లు అందజేస్తరు.