ఒకప్పుడు లవర్‌బాయ్ రోల్స్ లో నటించి మెప్పించిన నటుడు నవదీప్.. ఇప్పుడు సహాయనటుడిగా ఆకట్టుకుంటున్నారు. గత కొంతకాలం నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆద్యంతం ఆస్వాదిస్తున్నారు.
నవదీప్ పెళ్లి కోసం పలువురు నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 35 ఏళ్లు వచ్చాయి పెళ్లి చేసుకోండంటూ నెటిజన్లు తరచూ ఆయనకి సోషల్ మీడియా వేదికగా సలహాలిస్తున్నారు.
నెటిజన్ల నుంచి వస్తోన్న పెళ్లి కామెంట్లపై తాజాగా నవదీప్ స్పందించారు. పెళ్లి చేసుకోమంటూ ఉచిత సలహాలు ఇస్తున్న వారికి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
‘వద్దురా సోదరా’ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో ‘‘అన్నా నీ గడ్డం తెల్లబడుతోంది త్వరగా పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గడ్డం తెల్లబడితే చేయాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా..’’ అని నవదీప్ చెప్పుకొచ్చారు.
Oddhu ra sodhara 🙂 pic.twitter.com/IYKSAGFDVE
— Navdeep (@pnavdeep26) January 23, 2022